Jayalalitha: జయలలిత బయోపిక్ 'తలైవి' నుంచి కంగన రనౌత్ ఫస్ట్ లుక్ ఇదిగో!

షార్ట్స్‌లో చూడండి
పురచ్చితలైవి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'తలైవి'. ఈ బయోపిక్ లో బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కంగన రనౌత్ జయలలిత పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో  కంగన జయలలిత రూపంలో విక్టరీ సింబల్ చూపిస్తోంది. కాగా, ఈ రియల్ లైఫ్ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. జయలలిత జీవితంలో నాటకీయ పరిణామాలకు కొదవలేకపోవడంతో సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ఇప్పటినుంచే టాక్ వినిపిస్తోంది.

Go Back to Shorts
Jayalalitha
Kangana Ranaut
Tamilnadu
Thalaivi

More Telugu News