కోల్ కతా టెస్టులో కోహ్లీ, పుజారా అర్ధ సెంచరీలు
- టీమిండియా స్కోరు 43 ఓవర్లలో 3 వికెట్లకు 164 రన్స్
- 55 పరుగులు చేసి పుజారా అవుట్
- స్వల్ప స్కోర్లకే వెనుదిరిగిన మయాంక్, రోహిత్
ప్రస్తుతం కోహ్లీ 56 పరుగులతో ఆడుతుండగా, రహానే 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 43 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 14 పరుగులకే అవుటై నిరాశకు గురిచేయగా, రోహిత్ శర్మ పోరాటానికి 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తెరపడింది. అంతకుముందు, టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 106 పరుగులకే ఆలౌటైంది. ఇషాంత్ శర్మకు 5 వికెట్లు దక్కాయి.