బంగ్లా ప్రధానికి టీమిండియాను పరిచయం చేసిన కోహ్లీ.. గంట కొట్టి మ్యాచ్ ప్రారంభించిన హసీనా, మమతా బెనర్జీ వీడియో చూడండి!
- ముఖ్య అతిథిగా వచ్చిన షేక్ హసీనా
- స్వాగతం పలికిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ
- బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా
ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ టెస్టులో బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. షాద్మాన్ ఇస్లాం, ఇమ్రుల్ కేయీస్ ఓపెనర్లుగా బ్యాటింగ్ కు దిగారు. కాగా, హసీనా, మమతా బెనర్జీ గంటకొట్టి ఈ మ్యాచ్ ను ప్రారంభించారు. లార్డ్స్ మాదిరిగా ఈడెన్‌లోను గంట కొట్టి మ్యాచ్ ప్రారంభించే ఆనవాయితీని సౌరవ్ గంగూలీ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.