Sujeeth: మళ్లీ 'సాహో' నిర్మాతలతోనే సుజీత్!

షార్ట్స్‌లో చూడండి
'రన్ రాజా రన్' సినిమాతో హిట్ కొట్టేసిన సుజీత్, రెండవ సినిమాగా 'సాహో'ని తెరకెక్కించాడు. భారీ బడ్జెట్ తో ప్రభాస్ వంటి స్టార్ హీరోను హ్యాండిల్ చేశాడు. చిన్నవాడే అయినా .. అనుభవం తక్కువే అయినా హాలీవుడ్ రేంజ్ లో తన సత్తా చాటుకున్నాడు. అయితే భారీస్థాయిలో బిజినెస్ జరిగిన కారణంగా ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టడమే కష్టమైంది.

ఇక శర్వానంద్ కోసం సుజీత్ ఒక కథను సిద్ధం చేసుకున్నాడనీ, త్వరలోనే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కనుందనే టాక్ రెండు మూడు రోజులుగా వినిపిస్తోంది. ఈ సినిమాను నిర్మించేది కూడా యూవీ క్రియేషన్స్ వారేననేది తాజా సమాచారం. సుజీత్ తొలి సినిమా అయిన 'రన్ రాజా రన్'.. రెండవ సినిమా అయిన 'సాహో'ను నిర్మించిన యూవీ క్రియేషన్స్ వారే శర్వానంద్ సినిమాను కూడా నిర్మిస్తుండటం విశేషం.
Go Back to Shorts
Sujeeth
Sharwanand

More Telugu News