ప్రధాని మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ.. సమస్యలపై లేఖ అందజేత
- మహారాష్ట్రలో రైతుల సమస్యలపై మోదీకి వివరణ
- మోదీతో పవార్ మహారాష్ట్ర రాజకీయాలు కూడా చర్చ
- రాష్ట్రపతి పాలన విధించిన విషయాన్ని ప్రస్తావించిన పవార్
మోదీతో పవార్ మహారాష్ట్ర రాజకీయాల గురించి కూడా చర్చించినట్లు సమాచారం. అలాగే, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపై కూడా ఆయన ప్రస్తావించారు. మహారాష్ట్రలోని పరిస్థితులపై చొరవ తీసుకుని చక్కదిద్దాలని కోరినట్లు సమాచారం. కాగా, ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ కూడా పాల్గొనడం గమనార్హం.