ఒకే ఒక్క ఇంజక్షన్‌తో ఇక 13 ఏళ్లపాటు నో సంతానం.. అభివృద్ధి చేస్తున్న భారత శాస్త్రవేత్త
- సంతాన నిరోధానికి భారత వైద్యుల అద్భుత ఔషధం
- అందుబాటులోకి వస్తే రికార్డు
- ఇటువంటి ఇంజక్షన్ తయారీకి ప్రయత్నించి విఫలమైన అమెరికా
303 మందిపై మూడు విడతల్లో జరిపిన పరీక్షల్లో 97.3 శాతం సానుకూల ఫలితాలు వచ్చినట్టు పరిశోధన బృందం తెలిపింది. ఆర్‌ఐఎస్‌యూజీకి భారత ఔషధ నియంత్రణ మండలి ఆమోదం లభించేందుకు ఏడు నెలలు పట్టే అవకాశం ఉందని సమాచారం. 2016లో అమెరికా కూడా ఇటువంటి ఇంజక్షన్ అభివృద్ధికి ప్రయత్నించిన విజయం సాధించలేకపోయింది. ఆ ఇంజక్షన్ వికటించి పురుషుల మొహంపై మొటిమలు రావడం, శరీరంపై మచ్చలు రావడంతో ఆ ప్రయోగం పక్కన పడింది.