ఇప్పటి బీజేపీ నేతలు పుట్టకముందే శివసేన 'హిందుత్వ'కు మద్దతుగా నిలిచింది: సామ్నా
- ఓ కొలిక్కిరాని మహారాష్ట్ర రాజకీయం
- తమను ఎన్డీయే నుంచి తొలగించారంటూ శివసేన ఆగ్రహం
- సామ్నాలో సంపాదకీయం
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, ఎన్సీపీతో చర్చలు జరుపుతున్నందునే ఎన్డీయే నుంచి తొలగిస్తున్నట్టు చెప్పడం పట్ల శివసేన మండిపడింది. అది కూడా బాలా సాహెబ్ థాకరే వర్ధంతి రోజునే ఈ నిర్ణయం వెలిబుచ్చడం దారుణమని అభిప్రాయపడింది. గతంలో మోదీకి ఎవరూ అండగా నిలవని కాలంలో ఒక్క శివసేన మాత్రమే తోడుగా నిలిచిందని ఆ పార్టీ అధినాయకత్వం గుర్తుచేసింది.