ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైంది: శరద్ పవార్
- ఐదేళ్ల పాటు ప్రభుత్వం కొనసాగుతుందన్న పవార్
- శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల మధ్య కొలిక్కి వచ్చిన చర్చలు
- పదవుల పంపకాల్లో కుదిరిన ఒప్పందం
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల మధ్య చర్చలు ఫలప్రదమయ్యాయి. మూడు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. శివసేనకు పూర్థి స్థాయిలో సీఎం పదవి... ఎన్సీపీ, కాంగ్రెస్ లకు చెరో 14 మంత్రి పదవులతో పాటు చెరో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు సమాచారం.