Nani: కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన నాని

షార్ట్స్‌లో చూడండి
విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకోవడంలో నాని ఎప్పుడూ ముందే ఉంటాడు. కథ బాగుంటే చాలు దర్శకుడు కొత్త అయినా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అలా నాని  సినిమాతో పరిచయమైన కొత్త దర్శకులు చాలామందే వున్నారు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో 'వి' సినిమా చేస్తున్న నాని, తన తదుపరి సినిమాను కొత్త దర్శకుడితో చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

మహేశ్ అనే ఒక కొత్త దర్శకుడు వినిపించిన కథ నచ్చడంతో నాని ఓకే చెప్పేశాడట. ఈ సినిమాకి నాని నిర్మాతగా కూడా వ్యవహరిస్తాడని అంటున్నారు. కథా కథనాల్లో కొత్తదనం వున్నప్పుడే నిర్మాతగా నాని ముందుకొస్తుంటాడు. కనుక దర్శకుడు మహేశ్ కొత్త కాన్సెప్ట్ తోనే రంగంలోకి దిగుతున్నాడని అర్థమవుతోంది.
Go Back to Shorts
Nani

More Telugu News