ఇంగ్లీషు మీడియం మతమార్పిళ్లను ప్రోత్సహించేదైతే మీ పిల్లల్నెందుకు చదవించారు?: కన్నాపై సీపీఐ రామకృష్ణ విమర్శలు
- చర్చనీయాంశంగా మారిన ఇంగ్లీషు మీడియం
- అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం
- స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇంగ్లీషు మీడియం చదువులు మతమార్పిళ్లను ప్రోత్సహిస్తాయని కన్నా అనడం సరికాదని హితవు పలికారు. ఇంగ్లీషు మీడియం మతమార్పిళ్లను ప్రోత్సహించేదే అయితే మీ పిల్లల్నెందుకు ఇంగ్లీషు మీడియంలో చదివించారని కన్నాను ప్రశ్నించారు. అంతేకాకుండా సీఎం జగన్ వ్యాఖ్యలపైనా స్పందించారు. జగన్ విపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.