విశాల్ కోసం ర్యాప్ సాంగ్ పాడిన రానా 
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాల్ కోసం ర్యాప్ సాంగ్ పాడిన రానా 

  • విశాల్ .. తమన్నా జంటగా 'యాక్షన్' 
  • ఫ్రెండ్షిప్ కోసం సింగర్ గా మారిన రానా 
  • రెండు భాషల్లో ఒకే రోజున సినిమా రిలీజ్
విశాల్ హీరోగా సుందర్ సి. దర్శకత్వంలో 'యాక్షన్' సినిమా రూపొందింది. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

తాజాగా ఈ సినిమాను గురించి విశాల్ మాట్లాడుతూ, 'యాక్షన్' సినిమా తెలుగు వెర్షన్ కోసం రానా ఓ ర్యాప్ సాంగ్ పాడాడు. ఒక రోజున నేను కాల్ చేసి ఒక హెల్ప్ కావాలని అడిగాను. 'ఆడియో ఫంక్షన్ కి రావాలా?' అని అడిగాడు. కాదురా నా సినిమా కోసం ఒక పాట పాడాలని అడిగాను. 'నాకు మాట్లాడటమే సరిగ్గా రాదు .. పాట పాడటమేంట్రా?' అన్నాడు. చివరికి మా స్నేహానికి విలువనిస్తూ నా సినిమా కోసం పాడాడు. ఆ పాట చాలా బాగా వచ్చింది. రేపు గాని .. ఎల్లుండి గాని ఈ పాటను రిలీజ్ చేయనున్నాము. తమిళంలో ఇదే పాటను నా మిత్రుడు ఆది పినిశెట్టి పాడాడు" అని చెప్పుకొచ్చాడు.
Vishal
Rana

More Telugu News