అయ్యర్ సిక్సర్ల హోరు... నాగ్ పూర్ లో భారత్ భారీ స్కోరు
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 174 పరుగులు
- నిరాశపర్చిన రోహిత్ శర్మ
- అయ్యర్, రాహుల్ ఫిఫ్టీలు
రాహుల్ 35 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేయగా, అయ్యర్ 33 బంతుల్లోనే 62 పరుగులు సాధించాడు. బంగ్లా బౌలర్లపై విరుచుకుపడిన అయ్యర్ 3 ఫోర్లు, 5 భారీ సిక్సులు సంధించాడు. చివర్లో మనీష్ పాండే 13 బంతుల్లో చకచకా 22 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 174 పరుగులు సాధించింది. బంగ్లా బౌలర్లలో షఫియుల్ ఇస్లాం, సౌమ్య సర్కారు చెరో రెండు వికెట్లు తీశారు.