tiger: బ్రిడ్జ్ పై నుంచి నదిలోకి దూకేసిన పులి!

షార్ట్స్‌లో చూడండి
దాదాపు 35 అడుగుల ఎత్తున్న బ్రిడ్జ్ పై నుంచి ఓ పులి న‌దిలోకి దూకిన ఘటన మ‌హారాష్ట్ర‌లోని చంద్రాపూర్ లో చోటు చేసుకుంది. సిర్నా న‌దిలో దూకిన ఆ పులి మృతిచెందిందని అటవీ శాఖ అధికారులు చెప్పారు. దాని వెన్నెముక‌కు బలమైన గాయం అయుండొచ్చని వివరించారు.

సుమారు 24 గంట‌ల పాటు సహాయక ఆప‌రేష‌న్ చేపట్టామని, అయినప్పటికీ దాన్ని రక్షించలేకపోయామని వివరించారు. ఈ పులి మృతదేహం కునాడా గ్రామం గుండా ప్రవహించే సిర్నా న‌ది మ‌ధ్య లభ్యమైందని తెలిపారు. సహాయక బృందం దాని మృత‌దేహాన్ని న‌ది నుంచి బయటకు తీశారు. దాని చావుకు సంబంధించిన కార‌ణాల‌ను గుర్తిస్తామని వివరించారు. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది.

Go Back to Shorts
tiger
Maharashtra

More Telugu News