Trisha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
  *  మెగాస్టార్ చిరంజీవి సరసన నటించడానికి చెన్నై బ్యూటీ త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 'సైరా' తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి విదితమే. ఇందులో హీరోయిన్ పాత్రకు త్రిష డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం.
*  ఆమధ్య మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ 'తుప్పరివాలన్' (తెలుగులో 'డిటెక్టివ్'గా అనువదించారు) చిత్రాన్ని చేశాడు. అది బాక్సాఫీసు వద్ద విజయం సాధించడంతో ఇప్పుడు మిస్కిన్ దర్శకత్వంలోనే దానికి సీక్వెల్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ లండన్ లో జరుగుతోంది.
*  విజయ్ సేతుపతి, రాశిఖన్నా తమిళంలో 'సంగతమిళ్' పేరిట చేసిన చిత్రాన్ని తెలుగులోకి 'విజయ్ సేతుపతి' పేరిట అనువదించారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేస్తున్నారు.  
Go Back to Shorts
Trisha
Vishal
Rashi Khanna
Vijay Setupati

More Telugu News