అందుకే నిన్న బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయాం: రోహిత్ శర్మ
- ఫీల్డింగ్ వైఫల్యం కనపడింది
- టీమిండియా సాధించిన స్కోరు స్పల్పమేమీ కాదు
- ముష్పికర్ ను అవుట్ చేసే అవకాశాలు రెండుసార్లు వచ్చాయి
- మిస్ చేసుకున్నాం
బంగ్లా ఆటగాడు ముష్పికర్ రహీమ్‌ను అవుట్ చేసే అవకాశాలు తమకు రెండుసార్లు వచ్చినప్పటికీ వాటిని మిస్ చేసుకున్నామని రోహిత్ శర్మ తెలిపాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పటి నుంచీ ఒత్తిడికి గురయ్యామని, జట్టులో అనుభవం లేని ఆటగాళ్లు కూడా ఉన్నారని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రత్యర్థి జట్టు సద్వినియోగం చేసుకుందని చెప్పారు. అయితే, టీ20ల్లో యజ్వేంద్ర చహల్ మిడిల్ ఓవర్లలో బౌలింగ్‌తో ముఖ్య పాత్ర పోషిస్తాడని ప్రశంసించాడు.