మైదానంలో అడుగుపెట్టేందుకు తహతహలాడుతున్న బుమ్రా

  • వెన్నుగాయంతో చికిత్స తీసుకుంటున్న పేసర్  
  • కోలుకుంటున్నానంటూ సందేశం
  • న్యూజిలాండ్ పర్యటనకు ముందే జట్టులోకి రావాలని ఆశిస్తున్న అభిమానులు
వెన్ను గాయానికి చికిత్స తీసుకుంటూ క్రికెట్ కు దూరమైన భారత స్పీడ్ స్టర్ జస్ర్పీత్ బుమ్రా త్వరలో బరిలోకి దిగుతానంటున్నాడు. ఈరోజు జిమ్ లో వ్యాయామం చేసిన అనంతరం, ట్విట్టర్ మాధ్యమంగా ఒక సందేశాన్ని పోస్ట్ చేశాడు. ‘త్వరలోనే వచ్చేస్తున్నా’(కమింగ్ సూన్) అని కామెంట్ చేశాడు. మరోవైపు అభిమానులు బుమ్రా ఎప్పుడెప్పుడు మైదానంలోకి వస్తాడా అని ఎదురుచూస్తున్నారు. బుమ్రా త్వరగా కోలుకోవాలని వారు ట్వీట్లు పెడుతున్నారు. భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు ముందే బుమ్రా జట్టులోకి రావాలని జట్టు సహచరులు, అభిమానులు అభిలషిస్తున్నారు.

 ఇటీవల ప్రపంచకప్ తర్వాత వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో చివరిసారిగా బుమ్రా పాల్గొన్నాడు. అనంతరం వెన్నునొప్పితో ఆటకు దూరమయ్యాడు. స్కానింగ్ లో అతని వెన్నెముక కిందిభాగంలో సన్నని చీలిక వచ్చినట్లు తేలడంతో చికిత్సకోసం ఆటకు దూరమయ్యాడు. అసమాన బౌలింగ్ తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే బుమ్రా ఇటీవల విజ్డెన్ ఇండియా, క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
Go Back to Shorts
Bumrah
India
Cricket

More Telugu News