Samantha: 10 కేజీల డంబెల్ తో సమంత కసరత్తు... అలసిపోయి నేలపైనే విశ్రాంతి... వీడియో ఇదిగో!

షార్ట్స్‌లో చూడండి
అక్కినేని వారింటి కోడలైన తరువాత కూడా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ, హిట్ మీద హిట్ కొట్టేస్తున్న సమంత, శారీరక వ్యాయామం, శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడంపై ఎంత శ్రద్ధ చూపుతుందో అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె, జిమ్ లో వర్కవుట్లు చేస్తున్న ఓ వీడియో వైరల్ అవుతోంది. 10 కేజీల బరువున్న డంబెల్ తో సమంత వర్కవుట్లు చేసింది. ట్రయినర్ ప్రోత్సహిస్తుంటే, ఉత్సాహంగా కసరత్తు చేసింది. చివరకు అలసిపోయిందో ఏమో, నేలపైనే పడుకుని విశ్రాంతి తీసుకున్న ఫోటో, ఈ వీడియోలో కొనమెరుపు.
Go Back to Shorts
Samantha
Dumbel
Workouts

More Telugu News