ఓ చిన్న గదిలో గంగూలీని చూసి ఆశ్చర్యపోయాను: వీవీఎస్ లక్ష్మణ్
- గంగూలీకి బెంగాల్ క్రికెట్ సంఘం సన్మానం
- హాజరైన వీవీఎస్ లక్ష్మణ్
- గంగూలీకి క్రికెట్ అంటే ఎంతో ప్రేమని వెల్లడి
భారత క్రికెట్లో ఎంతో విజయవంతమైన కెప్టెన్ గా అందరి మన్ననలు అందుకుని, విశేషమైన పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న గంగూలీ క్రికెట్ పై ప్రేమతో అంత ఇరుకు గదిలోనూ పనిచేయడం ఎంతో ఆకట్టుకుందని వెల్లడించారు. ఆ దృశ్యం ఇప్పటికీ తనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. బెంగాల్ క్రికెట్ సంఘానికి దాదా చేసిన సేవలు చిరస్మరణీయం అని, బెంగాల్ క్రికెట్ కష్టకాలంలో ఉన్నప్పుడు దాదా పడిన కష్టం ఊరికే పోలేదని వివరించారు.
బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన గంగూలీని బెంగాల్ క్రికెట్ సంఘం ఘనంగా సత్కరించింది. కోల్ కతాలో జరిగిన ఈ కార్యక్రమానికి వీవీఎస్ లక్ష్మణ్, మహమ్మద్ అజహరుద్దీన్ తదితరులు హాజరయ్యారు.