చిరంజీవి ఇంట్లో సీనియర్ తారలకు పార్టీ!
- 'దక్షిణాదిన క్లాస్ ఆఫ్ ఎయిటీస్' గ్రూప్
- 1980 దశకంలో కలిసి నటించిన తారలే సభ్యులు
- ఈ సంవత్సరం చిరంజీవి ఇంట్లో పార్టీ
ఈ గ్రూప్ లోని వారే ఒక్కో సంవత్సరం ఒక్కో చోట పార్టీని ఎరేంజ్ చేస్తుంటారు. ఓ స్టార్ మిగతా అందరికీ పార్టీ ఇస్తారు. ఇక ఈ సంవత్సరం పార్టీని చిరంజీవి హోస్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇటీవల తన ఇంటిని రీ మోడలింగ్ చేయించిన చిరు, వచ్చే నెలలో జరిగే పార్టీకి అందరినీ పిలిచి, గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక, 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్' జరుపుకుంటున్న పదవ పార్టీ ఇదే కానుంది.