ఏం సమ్మె ఇది? బుద్ధీజ్ఞానంతో చేసేదేనా?: సీఎం కేసీఆర్
- టీఎస్సార్టీసీ కార్మికుల సమ్మెపై తీవ్ర విమర్శలు
- తిన్నది అరగక చేసే సమ్మెలా?
- ఏ ప్రభుత్వం ఉన్న ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటారు!
ఏ ప్రభుత్వం వున్నా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటారని విమర్శించారు. అసలు, ఈ సమ్మెకు కారణమేంటో తెలుసా? కార్మిక సంఘాలకు రెండేళ్లకో, మూడేళ్లకో, నాలుగేళ్లకో దిక్కుమాలిన యూనియన్ ఎలక్షన్స్ ఉంటాయని, ఆ ఎలక్షన్ల ముందు చేసే పనికిమాలిన సమ్మెలివి అని విమర్శించారు. యూనియన్ ఎలక్షన్ల ముందు గొంతెమ్మ కోర్కెలు, అలవికాని కోర్కెలు పెట్టి సమ్మె రూపంలో కార్మికులను రెచ్చగొట్టి, నాలుగు ఓట్లు రాబట్టుకునే చిల్లరమల్లర రాజకీయాల సమ్మె ఇదని తీవ్ర విమర్శలు చేశారు.