Maharashtra: మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాం: జీవీఎల్

షార్ట్స్‌లో చూడండి
ఉత్తరాదిన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. హర్యానాలో అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోయినా కర్ణాటక తరహా పరిస్థితి రాబోదని, తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అటు మహారాష్ట్రలో బీజేపీకి హవా తెలుస్తోందని అన్నారు. హర్యానాలో స్థానిక పరిస్థితులు కాస్త ప్రతికూలంగా మారాయని భావిస్తున్నామని జీవీఎల్ తెలిపారు.
Go Back to Shorts
Maharashtra
Haryana
BJP
GVL
Congress

More Telugu News