విధుల్లో అలసత్వానికి మూల్యం.. ఏసీపీ నరసింహారెడ్డి బదిలీ

  • ప్రగతిభవన్ ముందు ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆసిఫ్ నగర్ ఏసీపీ
  • డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు
  • డీసీపీ సుమతికి  ఆసిఫ్ నగర్ సబ్ డివిజన్ బాధ్యతలు
విధుల్లో అలసత్వం వహించడంతో ఆసిఫ్ నగర్ ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డిపై బదిలీ వేటు పడింది. నరసింహారెడ్డి ప్రగతిభవన్ ముందు ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఆసిఫ్ నగర్ సబ్ డివిజన్ బాధ్యతలను డీసీపీ సుమతికి అప్పజెప్పారు.
Go Back to Shorts
ACP
Narasimhareddy
Hyderabad
Telangana

More Telugu News