Chiranjeevi: కొరటాలతో బడ్జెట్ గురించి చర్చించిన చరణ్!

షార్ట్స్‌లో చూడండి
కొరటాల - చిరంజీవి కాంబినేషన్లో రూపొందనున్న సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. వచ్చేనెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే చరణ్ .. కొరటాలతో ఈ సినిమా బడ్జెట్ గురించి మరోసారి చర్చించినట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత వరకూ బడ్జెట్ ను నియంత్రిస్తూ వెళ్లమని ఆయనకి సూచించినట్టు సమాచారం.

ఈ ప్రాజెక్టుకు ముందు చరణ్ 'సైరా' సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ సినిమా కంటెంట్ పరంగా శభాష్ అనిపించుకుంది. ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా, వసూళ్లపరంగా ఆశించినస్థాయి వేగాన్ని చూపలేకపోతోంది. ఈ కారణంగానే తమ సినిమా బడ్జెట్ పరిథిని దృష్టిలో పెట్టుకుని, ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కొరటాలకి చరణ్ చెప్పాడని అంటున్నారు. మొత్తానికి కొరటాలకి మరికొంత బాధ్యత పెరిగినట్టే.
Go Back to Shorts
Chiranjeevi
Charan
Koratala

More Telugu News