రాంచీ టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్.. ఫాలో ఆన్ ఇచ్చిన కొహ్లీ సేన
- టీమిండియా బౌలర్ల ధాటికి కుప్పకూలిన బ్యాట్స్ మెన్
- ఉమేశ్ యాదవ్ కి మూడు వికెట్లు
- 62 పరుగులు చేసిన హంజా
టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ కి మూడు వికెట్లు, షమీ, జడేజా, నదీమ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. టీమిండియా నిన్న 116.3 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 497 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 335 పరుగుల ఆధిక్యంలో ఉంది. దీంతో దక్షిణాఫ్రికాకు కోహ్లీ సేన ఫాలో ఆన్ ఇచ్చింది.