సైబర్ మోసగాడి వలకు చిక్కిన పోలీసు కానిస్టేబుల్.. ఖాతా నుంచి రూ.80 వేలు మాయం
- గూగుల్ పే ద్వారా రూ.10 వేలు చెల్లింపు
- బదిలీ జరగక పోవడంతో కస్టమర్ కేర్‌కి ఫోన్
- అంతే.. లైన్లోకి వచ్చి టోకరా ఇచ్చిన నేరగాడు
అంతే.. కాసేపటికి ఓ సైబర్ నేరగాడు లైన్లోకి వచ్చాడు. మీరిచ్చిన ఫిర్యాదు పరిశీలించామని, ట్రాన్సాక్షన్ కన్‌ఫర్మ్ అయ్యేందుకు ఓ లింక్ పంపుతామని, దానిపై క్లిక్ చేసి ఐడీ నంబర్ చెప్పండని నమ్మబలికాడు. అతను గూగుల్ పే ఉద్యోగి అనుకుని సురేష్ అలాగే చేశాడు. అంతే.. కాసేపటికి అతని ఖాతా నుంచి రూ.80 వేలు డెబిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని భావించిన సురేష్ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.