Car: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు జాతీయ హాకీ ఆటగాళ్ల దుర్మరణం!

షార్ట్స్‌లో చూడండి
మధ్యప్రదేశ్ లోని హోంషంగాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ధ్యాన్ చంద్ హాకీ పోటీల్లో పాల్గొనేందుకు ఇటార్సీకి వెళుతున్న నలుగురు జాతీయ హాకీ క్రీడాకారులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు క్రీడాకారులకు తీవ్ర గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 69వ జాతీయ రహదారిపై రైసల్ పూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగంగా వస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Go Back to Shorts
Car
Hockey
Died
Road Accident
Madhya Pradesh

More Telugu News