Jagan: గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి కచ్చితంగా తేడా కనిపించాలి: అధికారులకు తేల్చిచెప్పిన సీఎం జగన్

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర పాలనలో తనదైన ముద్రవేయాలని పరితపిస్తున్న సీఎం జగన్ మరోసారి అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి పాలనాపరంగా కచ్చితమైన తేడా కనిపించాలంటూ అధికారులకు స్పష్టం చేశారు. డిసెంబర్ 1 నాటికి అన్ని సచివాలయాలు పని ప్రారంభించాలని, కొత్త సంవత్సరంలో అర్హులకు కొత్తగా పింఛన్లు, రేషను కార్డులు మంజూరు చేయాలని ఆదేశించారు. జనవరి నుంచి 500 రకాల పౌరసేవలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ముఖ్యంగా, ఇసుక మాఫియాపై కఠినవైఖరి అవలంబించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోసారి రాష్ట్రంలో ఇసుక మాఫియా కనిపించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఇసుక కొరత తీర్చే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అక్రమ రవాణా నిరోధించాలని తెలిపారు. ఇసుక రవాణాలో రాజకీయ జోక్యం ఉండకూడదని, పొరుగు రాష్ట్రాలకు ఇసుక రవాణాపై చెక్ పోస్టుల వద్ద నిఘా ఉంచాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Jagan
Andhra Pradesh
YSRCP

More Telugu News