'అల వైకుంఠపురములో' చిత్రానికి హైలైట్ గా నిలవనున్న కామెడీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అల వైకుంఠపురములో' చిత్రానికి హైలైట్ గా నిలవనున్న కామెడీ

  • త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ 
  • రాహుల్ రామకృష్ణ పాత్ర హైలైట్ 
  • సంక్రాంతికి భారీ రిలీజ్  
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 'అల వైకుంఠపురములో' చిత్రం రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, 'టబు' కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్స్ హైలైట్ కానున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. రాహుల్ రామకృష్ణ పాత్రకి త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ నవ్వుల్లో ముంచెత్తుతాయని అంటున్నారు.

గత కొన్ని సినిమాల విషయంలో తన మార్క్ పంచ్ డైలాగ్స్ ను పక్కన పెట్టేసిన త్రివిక్రమ్, ఈ సినిమాలో డైలాగ్స్ పరంగా తన విశ్వరూపం చూపించనున్నాడని అంటున్నారు. అలాగే హీరో .. హీరోయిన్ వెంటపడి వేధించే రొమాంటిక్ కామెడీ సీన్స్ కూడా తెగ నవ్వించేస్తాయని చెబుతున్నారు. గీతా ఆర్ట్స్ - హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
Allu Arjun
Pooja Hegde

More Telugu News