ఫరూక్ అబ్దుల్లాకు షాక్.. ఆయనపై కఠినమైన పీఎస్ఏ చట్టం ప్రయోగం
- గత నెల 5 నుంచి గృహ నిర్బంధంలోనే ఫరూక్ అబ్దుల్లా
- సోమవారం పీఎస్ఏ కింద నోటీసులు జారీ
- ఆయన ఇంటిని జైలుగా ప్రకటించిన ప్రభుత్వం
సోమవారం మధ్యాహ్నం ఆయనకు పీఎస్ఏ కింద నోటీసులు జారీ అయ్యాయి. ఆ వెంటనే శ్రీనగర్‌లో ఆయన నివసిస్తున్న ఇంటిని జైలుగా ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం ఆయన ఇంటి చుట్టూ బారికేడ్లు, కంచెను ఏర్పాటు చేశారు. ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా గత నెల నుంచీ గృహ నిర్బంధంలోనే ఉన్నారు.