విశాల్ హీరోగా 'యాక్షన్' .. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇస్తానన్న హీరో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాల్ హీరోగా 'యాక్షన్' .. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇస్తానన్న హీరో

  • యాక్షన్ హీరోగా విశాల్ కి క్రేజ్
  • తీవ్రవాదం నేపథ్యంలో సాగే కథ 
  • విశాల్ జోడీగా తమన్నా
తెలుగు .. తమిళ భాషల్లో విశాల్ కి మంచి క్రేజ్ వుంది. తమిళంలో మాస్ యాక్షన్ హీరోగా ఆయనకి గల ఆదరణ అంతా ఇంతా కాదు. మొదటి నుంచి కూడా యాక్షన్ సినిమాలను ఎక్కువగా చేస్తూ వస్తోన్న విశాల్, ఈ సారి 'యాక్షన్' అనే టైటిల్ తోనే ఒక సినిమా చేస్తున్నాడు. తీవ్రవాదం నేపథ్యంలో సాగే ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది.

ఇప్పటికే దర్శకుడు సుందర్ సి. కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాడు. ఈ సినిమాలో విశాల్ సరసన కథానాయికగా తమన్నా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఈ రోజు రాత్రి 8 గంటలకు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వనున్నట్టుగా తన ట్విట్టర్ ద్వారా విశాల్ తెలియజేశాడు. ఆ అప్డేట్ ఏమిటనేది అభిమానుల్లో ఆత్రుతను పెంచుతోంది.
Vishal
Tamanah

More Telugu News