కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారు... టీఆర్ఎస్ కు నేను కూడా ఓనర్ నే: నాయిని ఘాటు వ్యాఖ్యలు

  • మంత్రిని చేస్తానని కేసీఆర్ మాట తప్పారు
  • హోంమంత్రిగా చేసిన నాకు ఛైర్మన్ పదవి ఎందుకు?
  • పార్టీలోకి కిరాయికి వచ్చిన వారు ఎప్పుడు దిగిపోతారో తెలియదు
టీఆర్ఎస్ నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముషీరాబాద్ టికెట్ అడిగితే... 'ముఠా గోపాల్ ను గెలిపించుకునిరా... నిన్ను మంత్రిని చేస్తా'నని కేసీఆర్ మాట ఇచ్చారని... ఇప్పుడు ఆ మాట తప్పారని మండిపడ్డారు. హోంమంత్రిగా పని చేసిన తనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఎందుకని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి తాను కూడా ఓనర్ నే నని వ్యాఖ్యానించారు. పార్టీలోకి కిరాయికి వచ్చిన వారు ఎప్పుడు దిగిపోతారో తెలియదని అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
KCR
TRS
Nayini

More Telugu News