తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు
- ఈ నెల 9న ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు
- ఆర్థిక మంత్రిగా శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేసీఆర్
- బీఏసీ సమావేశంలో సమావేశాల పూర్తి ఎజెండా నిర్ణయం
అదే రోజున ఆర్థిక మంత్రిగానూ వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో ఓ మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆ మంత్రి ఎవరనేది తెలియాల్సి ఉంది. నిజానికి బడ్జెట్ సమావేశాలను ఈ నెల 4, 9, 14 తేదీల్లో ఏదో ఒక రోజున ప్రారంభించాలని ప్రతిపాదించారు. అయితే, అన్ని విషయాలు చర్చించిన అనంతరం చివరికి 9వ తేదీని నిర్ణయించారు.