Nagarjuna: నాగ్ బర్త్ డే పార్టీలో రూ.2 లక్షల ఖరీదైన డ్రెస్ తో తళుక్కుమన్న సమంత

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ కింగ్ నాగార్జున జన్మదినం సందర్భంగా ఘనంగా వేడుక నిర్వహించారు. నాగ్ తన 60వ జన్మదినోత్సవాన్ని ఈసారి స్పెయిన్ లోని ఇబిజా ప్రాంతంలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో నాగ్ కోడలు సమంత అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు కారణం ఆమె ధరించిన పింక్ కలర్ డ్రెస్సే. సింగిల్ షోల్డర్ డ్రెస్ లో సమంత హొయలు పోయింది. ఈ అల్ట్రామోడ్రన్ డిజైనర్ డ్రెస్ ఖరీదు రూ.2 లక్షలు! ఇక, నాగ్ ఎప్పట్లానే యంగ్ లుక్ తో మరోసారి అలరించారు. ఆయన 60వ పడిలో ప్రవేశించారంటే నమ్మశక్యం కాని రీతిలో ఫొటోల్లో దర్శనమిచ్చారు.
Go Back to Shorts
Nagarjuna
Samantha

More Telugu News