నడిరోడ్డుపై వింతగా ప్రవర్తించి స్థానికులతో తన్నులు తిన్న కన్నడ సినీ నటుడు
- హోటల్ కు వెళ్లిన సినీ నటుడు హుచ్చా వెంకట్
- చూసేందుకు ఎగబడిన జనాలు
- తీవ్ర ఆగ్రహంతో రోడ్డుపైకి వచ్చి కారును ధ్వంసం చేసిన వెంకట్
- చితకబాదిన స్థానికులు
గతంలో అనేక వివాదాలతో బ్యాడ్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న హుచ్చా వెంకట్ మరోసారి అదే రీతిలో హంగామా చేయడమే కాదు, ఈసారి స్థానికుల చేతిలో తన్నులు కూడా తిన్నాడు. కర్ణాటకలోని కొడగులో హుచ్చా వెంకట్ ఓ హోటల్ కు వెళ్లాడు. అయితే సినీ నటుడు కావడంతో వెంకట్ ను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ సెలబ్రిటీ హోటల్ బయటికి వచ్చి ఓ కారును ధ్వంసం చేశాడు. ఇష్టంవచ్చినట్టు రంకెలేస్తూ, వింతగా ప్రవర్తిస్తుండడంతో స్థానికులు చితకబాదారు. అయినప్పటికీ హుచ్చా వెంకట్ విచిత్రంగా ప్రవర్తిస్తూ మీడియా కెమెరాల కంట్లో పడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ సినీ నటుడ్ని అదుపులోకి తీసుకున్నారు.