సీఎం కేసీఆర్ కు రెండు రాకెట్లను బహూకరించిన పీవీ సింధు
- ప్రగతిభవన్ లో కేసీఆర్ ను కలిసిన సింధు
- సింధును మనస్ఫూర్తిగా అభినందించిన కేసీఆర్
- సింధు దేశగౌరవాన్ని నిలబెట్టిందంటూ వ్యాఖ్యలు
ఈ సందర్భంగా కేసీఆర్ మనస్ఫూర్తిగా సింధును అభినందించారు. సింధు దేశగౌరవాన్ని నిలబెట్టిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విజేతలను తయారు చేసే వేదికలా మారిందని అన్నారు. భవిష్యత్తులో సింధు పాల్గొనే టోర్నమెంట్లకు ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు ఉంటాయని, సింధుకు మున్ముందు అన్ని విధాలా సాయం అందిస్తామని తెలిపారు.
