తుగ్లక్ లా చరిత్రలోకి ఎక్కవద్దని కోరుకుంటున్నా: జగన్ కు కేశినేని నాని సలహా
- రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు మారుస్తారనే ప్రచారంపై కేశినేని స్పందన
- తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు.. అక్కడి నుంచి మళ్లీ ఢిల్లీకి మార్చారు
- తుగ్లక్ లా వ్యవహరించవద్దని కోరుకుంటున్నా
'జగన్ గారూ... చిన్నప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం. 1328లో రాజధానిని ఢిల్లీ నుంచి మహారాష్ట్రలోని దౌలతాబాద్ కు మార్చారు. తిరిగి అక్కడి నుంచి ఢిల్లీకి మార్చారు. ఆ తుగ్లక్ లా మీరు చరిత్ర పుటల్లోకి ఎక్కకూడదని కోరుకుంటున్నా' అని కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జగన్ తో పాటు తుగ్లక్ ఫొటోను కూడా షేర్ చేశారు.