సినిమా తీస్తానంటూ... హీరో విశాల్ పేరు చెప్పి మోసం చేసిన తమిళ దర్శకుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా తీస్తానంటూ... హీరో విశాల్ పేరు చెప్పి మోసం చేసిన తమిళ దర్శకుడు!

  • బడా వ్యాపారిని మోసం చేసిన వడివుడైయాన్
  • విశాల్ కాల్ షీట్స్ చూపి రూ. 47 లక్షలు స్వాహా
  • డబ్బులు తిరిగి ఇవ్వమంటే ఇవ్వడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు
ప్రముఖ తమిళ నటుడు విశాల్ ను హీరోగా పెట్టి సినిమా చేస్తానని చెప్పిన దర్శకుడు వడివుడైయాన్‌, తనను మోసం చేశారని నరేశ్ బోద్రా అనే వ్యాపారి పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల మేరకు, సినిమా తీయాలన్న కోరికతో ఉన్న బోద్రాను కలిసిన వడివుడైయాన్‌, తన వద్ద విశాల్‌ కాల్‌ షీట్స్‌ ఉన్నాయని చెప్పి, అందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను చూపించాడు.

విశాల్ తో సినిమా అనగానే నరేశ్ బోద్రా సైతం సంతోషించి, రూ. 47 లక్షలను దర్శకుడికి ఇచ్చారు. ఆపై సినిమా ప్రారంభం కాకపోవడంతో అనుమానం వచ్చి, ఒప్పంద పత్రాలను పరిశీలించగా అవి నకిలీవని తేలింది. దీంతో తానిచ్చిన డబ్బును ఇవ్వాలని అడుగుతుంటే, ఇవ్వకుండా మోసం చేస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నరేశ్ ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వడివుడైయాన్‌ ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, నరేశ్‌బోద్రా ఎవరో తనకు తెలియదని వడివుడైయాన్ అంటుండటం గమనార్హం.
Kollywood
Vishal
Movie

More Telugu News