Andhra Pradesh: జగన్ తో ఉండే తోక నేత అమెరికాకు ఎందుకు వెళ్లలేదు.. జైల్లో వేస్తారనా?: బుద్ధా వెంకన్న

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారి అమెరికా పర్యటనకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఎందుకు డుమ్మా కొట్టారని ప్రశ్నించారు. జగన్ గారి ప్రతీ పర్యటనలో ఉండే ఈ తోకనేత అమెరికా పర్యటనకు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు.

విదేశాలకు వెళితే నిమ్మగడ్డ ప్రసాద్ లా ఆయన్ను కూడా జైల్లో వేస్తారని భయపడుతున్నారేమో? అని ఎద్దేవా చేశారు. ఒకవేళ జైలులో వేసినా ‘ప్రజాసేవ చేస్తుంటే జైలులో వేశారు’ అని చెప్పడానికి దొంగ పేపర్, దొంగ ఛానల్ అమెరికాలో లేవని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో స్పందించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
budda venkanna
YSRCP

More Telugu News