శ్రీదేవి మానసికంగా మాతోనే మమేకమై ఉంది : బోనీకపూర్
- ఆమె భౌతికంగానే దూరమయ్యింది
- ఆమె ఆత్మ మా చుట్టూనే తిరుగుతుంది
- మా బాగోగులు తనే చూసుకుంటోంది
‘నా వృత్తిలో నేను చాలామంది నటీనటులతో కలిసి పనిచేశాను. కానీ శ్రీదేవి వ్యక్తిత్వం వేరు. ఆమెది నిత్యం కష్టపడేతత్వం. కష్టపడేవారంటే నాకు గౌరవం. శ్రీదేవి అంటే మరింత గౌరవం అందుకే. బతికి ఉన్నన్నాళ్లు ఓ లెజెండ్‌గా వెలుగొందింది. చనిపోయాక కూడా ఓ లెజెండ్‌గానే మిగిలి పోయింది. ఆమె ఎప్పటికీ గొప్ప వ్యక్తి’ అని బోనీకపూర్ భార్య వ్యక్తిత్వాన్ని కొనియాడారు. శారీరకంగా శ్రీదేవి తమతో లేకున్నా తమని ఆశీర్వదిస్తూ బాగోగులు చూసుకుంటూ నిత్యం తమతోనే ఉంటుందన్న భావనలో ఉన్నామని బోనీకపూర్ తెలిపారు.
శ్రీదేవి జయంతి సందర్భంగా మంగళవారం బోనీ ఓ ట్వీట్ కూడా చేశారు. ‘జీవితంలోని ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతున్నా జాన్. నీ జ్ఞాపకాలు శాశ్వతంగా మాతోనే ఉంటాయి. మమ్మల్ని ఇలాగే నడిపించు. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ట్విట్టర్‌లో బోనీ పేర్కొన్నారు.