శేఖర్ కమ్ముల మూవీలో క్లాసికల్ డాన్సర్ గా సాయిపల్లవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శేఖర్ కమ్ముల మూవీలో క్లాసికల్ డాన్సర్ గా సాయిపల్లవి

  • శేఖర్ కమ్ముల తాజా చిత్రానికి సన్నాహాలు 
  • ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల
ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే కథలను ఎంచుకోవడం శేఖర్ కమ్ముల ప్రత్యేకత. కథతో సహజత్వాన్ని కలిపి నడిపించే ఆయన, తన తదుపరి సినిమాను పట్టాలెక్కించే పనిలో వున్నాడు. నాగచైతన్య - సాయిపల్లవి కాంబినేషన్లో ఒక సినిమాను రూపొందించడానికి శేఖర్ కమ్ముల సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఈ సినిమాలో సాయిపల్లవి క్లాసికల్ డాన్సర్ గా కనిపిస్తుందట. కథ ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. చైతూ కెరియర్లోను ఇది చెప్పుకోదగిన పాత్ర అవుతుందని చెబుతున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తొలి షెడ్యూల్లో చైతూ .. సాయిపల్లవి కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తారట. డిసెంబర్ నాటికి ఈ సినిమా షూటింగును పూర్తిచేసి, వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయనున్నట్టుగా సమాచారం. 
Chaitu
sai pallavi

More Telugu News