Ramcharan: మళ్లీ శర్వానంద్ ను ఎలా చూడాలనుకున్నామో అలా ఉంది: రామ్ చరణ్

షార్ట్స్‌లో చూడండి
యువ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ రణరంగం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి సౌండ్ కట్ ట్రైలర్ ను రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఎంతో విభిన్నమైన రీతిలో ఉన్న ఈ సౌండ్ కట్ ట్రైలర్లో ఎలాంటి డైలాగులు లేకుండా, కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నే హైలైట్ చేశారు. దీని గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ, సౌండ్ కట్ ట్రైలర్ రిలీజ్ చేయడం ఎంతో కొత్తగా ఉందని వ్యాఖ్యానించారు.

ఈ ట్రైలర్ బీభత్సంగా ఉందని, శర్వానంద్ ను ఎలా చూడాలని భావించామో అలాగే ఉందని తెలిపారు. శర్వాలో తనకు నచ్చే అంశం సినిమా పట్ల అతడికి ఉండే తీవ్రత అని చెర్రీ వెల్లడించారు. శర్వా కెరీర్ లో కో అంటే కోటి తర్వాత అదే స్థాయి ఉన్న చిత్రం రణరంగం అవుతుందని అన్నారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలని ఆశిస్తున్నానని రామ్ చరణ్ పేర్కొన్నారు.

Go Back to Shorts
Ramcharan
Sharwanand
Ranarangam
Tollywood

More Telugu News