నన్ను ప్రోత్సహించే అత్తామామలకు కోడల్ని కావడం గర్వంగా ఉంది: ఉపాసన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నన్ను ప్రోత్సహించే అత్తామామలకు కోడల్ని కావడం గర్వంగా ఉంది: ఉపాసన

  • బీ పాజిటివ్ మ్యాగజైన్ కు చీఫ్ ఎడిటర్ గా ఉపాసన
  • లేటెస్ట్ ఎడిషన్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన చిరంజీవి
  • చిరంజీవి కవర్ పేజీతో రిలీజైన బీ పాజిటివ్ మ్యాగజైన్
టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన సామాజిక సేవ, ఆరోగ్యం, ఇతర రంగాల్లో ఎంతో బిజీగా ఉంటారు. ఆమె బీ పాజిటివ్ అనే మ్యాగజైన్ కు ప్రధాన సంపాదకురాలు కూడా. ఆ పత్రిక లేటెస్ట్ ఎడిషన్ లో చిరంజీవి ఇంటర్వ్యూ కూడా ఉంది. ఆ మ్యాగజైన్ కవర్ పేజీపైనా స్లిమ్ లుక్ లో ఉన్న చిరు కనువిందు చేస్తున్నారు. తాజాగా, మెగా కోడలు ఉపాసన తన అత్తామామల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

చిరంజీవి బీ పాజిటివ్ మ్యాగజైన్ తాజా సంచికను ఆసక్తిగా చదువుతుండగా, మరో ఫొటోలో సురేఖ హెల్త్ కిట్ లోని ప్రొడక్ట్స్ ను పరిశీలిస్తున్నారు. దీనిపై ఉపాసన వ్యాఖ్యానిస్తూ, వృత్తిపరంగా ఎంతో ప్రోత్సాహం అందించే ఇలాంటి అత్తామామలకు కోడల్ని కావడం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు. కెరీర్ కు మద్దతు ఇవ్వడమే కాకుండా, ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారంటూ చిరు, సురేఖలపై ప్రశంసల జల్లు కురిపించారు. నా బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్స్ వీళ్లిద్దరేనంటూ మురిసిపోయారు.

Upasana
Chiranjeevi
Surekha

More Telugu News