'గుణ 369' దర్శకుడితో మరోసారి కార్తికేయ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గుణ 369' దర్శకుడితో మరోసారి కార్తికేయ

  • అర్జున్ జంధ్యాల తొలి చిత్రంగా వచ్చిన 'గుణ 369'
  • కార్తికేయతో మరో యాక్షన్ ఎంటర్టైనర్ 
  • డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే ఆలోచన  
అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ తాజా చిత్రంగా 'గుణ 369' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ కు .. ఎమోషన్ కు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అర్జున్ జంధ్యాల టేకింగ్ తనకి బాగా నచ్చిందని ఈ సినిమా వేడుకల్లో కార్తికేయ చెప్పాడు.

అర్జున్ జంధ్యాల దర్శకత్వంలోనే మరో సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేది తాజా సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లోనే అర్జున్ జంధ్యాల బిజీగా వున్నాడు. ఈ సినిమా కూడా లవ్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఉంటుందని అంటున్నారు. డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇతర నటీనటులు .. సాంకేతిక వర్గానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. 
Karthikeya
Arjun Jandyala

More Telugu News