చంద్రబాబు కార్న్ తింటూ కులాసాగా తిరుగుతుంటే.. ‘ఇస్మార్ట్ నాని’ బెజవాడను దివాళా తీయిస్తున్నాడు!: పీవీపీ సెటైర్లు
- కేశినేని నానిపై దాడిని తీవ్రతరం చేసిన పీవీపీ
- వ్యాపారాలు మూసి అందర్ని రోడ్డున పడేశాడని ఆరోపణ
- ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
‘చంద్రబాబు గారూ.. తమరు రోడ్లు మీద కార్న్ తింటూ కులాసాగా తిరుగుతున్నారు. ఇక్కడ మీ సహచరుడు శ్రీ. Ismart Nani వ్యాపారాలు మూసేసి అందరిని రోడ్డున పడేసి బెజవాడను దివాలా తీస్తున్నాడు. తమరు దయచేసి,ఆ హెరిటేజ్ పాలు పంపిస్తే, బారులు తీరిన అప్పుల వాళ్లకు,ఓ కప్పు కాఫీ ఇస్తాం’ అని పీవీపీ ట్వీట్ చేశారు. కేశినేని కార్గో వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుంటూ కెనరా బ్యాంకు జారీచేసిన స్వాధీనతా ప్రకటనను దీనికి పీవీపీ జత చేశారు.