అక్షయ్ కుమార్ పారితోషికం 54 కోట్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అక్షయ్ కుమార్ పారితోషికం 54 కోట్లు!

  • విలక్షణ నటుడిగా అక్షయ్ కుమార్ 
  • వరుసగా దక్కుతోన్న విజయాలు 
  • భారీగా పెరుగుతోన్న మార్కెట్ 
బాలీవుడ్ స్టార్ హీరోల రేసులో తన దూకుడు ఎంత మాత్రం తగ్గకుండా అక్షయ్ కుమార్ జాగ్రత్త పడుతూ వస్తున్నాడు. వైవిధ్యభరితమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వరుస విజయాలను తన ఖాతాలో జమ చేస్తున్నాడు. ఒక్కో సినిమాకి తన క్రేజ్ ను .. మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతోన్న అక్షయ్ కుమార్, తాజాగా తన పారితోషికాన్ని 54 కోట్లుగా ఫిక్స్ చేయడం బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.

గతంలో 'రౌడీ రాథోర్' సినిమాకి గాను 27 కోట్ల పారితోషికాన్ని అందుకున్న అక్షయ్ కుమార్, అప్పటి నుంచి సక్సెస్ ను బట్టి .. మార్కెట్ విలువను బట్టి తన పారితోషికాన్ని పెంచుతూ వచ్చాడు. అలా తాజాగా ఆయన ఒక్కో సినిమాకి 54 కోట్ల పారితోషికాన్ని ఫిక్స్ చేయడం విశేషం. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'మిషన్ మంగళ్' ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 
Akshay Kumar

More Telugu News