నా విషయంలో దేవుడు కన్ఫ్యూజ్ అయ్యాడు: ట్రాన్స్ జండర్ తమన్నా సింహాద్రి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా విషయంలో దేవుడు కన్ఫ్యూజ్ అయ్యాడు: ట్రాన్స్ జండర్ తమన్నా సింహాద్రి

  • అమ్మానాన్నలు పెట్టిన పేరు మస్తాన్ 
  • ముంబైలో లింగమార్పిడి చేయించుకున్నాను
  • స్క్రీన్ పై నన్ను నేను చూసుకోవాలనేది నా ఆశ
సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యేవారికి ట్రాన్స్ జండర్ తమన్నా సింహాద్రి గురించి తెలుసు. ఇక 'బిగ్ బాస్ 3'లోకి ఈ రోజున ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తుండటంతో, అంతా ఆమెను గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందే తమన్నా ఒక ఇంటర్వ్యూలో తన గురించిన విషయాలను ఇలా చెప్పుకొచ్చింది.

"మా అమ్మానాన్నలు నాకు పెట్టిన పేరు మస్తాన్ .. ఇంటిపేరు సింహాద్రి. మాది కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతం .. మా నాన్న నాగేశ్వరరావు వ్యవసాయం చేసేవారు. అబ్బాయి పుట్టాలని మా నాన్న .. అమ్మాయి పుట్టాలని మా అమ్మ దర్గా దగ్గర మొక్కుకున్నారు. దేవుడు కన్ఫ్యూజ్ అయ్యాడేమో నేను పుట్టాను. స్క్రీన్ పై నన్ను చూసుకోవాలనే ఆశ నాలో ఎక్కువగా ఉండేది. ముంబైలో జాబ్ చేస్తూనే లింగ మార్పిడి చేయించుకున్నాను. అప్పుడే నా పేరును తమన్నాగా మార్చుకున్నాను. అంతేగానీ హీరోయిన్ తమన్నాను చూసి నా పేరు మార్చుకోలేదు. అప్పటికి ఆమె ఇండస్ట్రీకే రాలేదు" అని చెప్పుకొచ్చింది.
Tamannah

More Telugu News