Hema: హిజ్రా తమన్నా హౌస్ లోకి ఎంటరవుతున్న వేళ... మిగతావారి రియాక్షన్ వీడియో!

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజన్ తొలి వారం వివాదాల నడుమ పూర్తికాగా, చివరి రోజున నటి హేమ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హిజ్రా తమన్నాను కంటెస్టెంట్ గా పరిచయం చేసిన నాగార్జున, తమన్నాను హౌస్ లోకి పంపించాడు. ఆ సమయంలో ఆమెను చూసిన హౌస్ మేట్స్ ఒక్కసారిగా అయోమయంలో పడ్డట్టు కనిపించింది. కొందరు ముక్కున వేలేసుకున్నారు. మరికొందరు ఆశ్చర్యంతో చూశారు. ఇంకొందరు తమ ముఖాల్లో హావభావాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ మా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 
Go Back to Shorts
Hema
Biggboss
Tamannah
Hizra

More Telugu News