Police: కరుడుగట్టిన నేరస్తుడు రవిశేఖర్ ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ లో ఫార్మసీ విద్యార్థిని సోనీని అపహరించిన కరుడుగట్టిన నేరస్తుడు రవిశేఖర్ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు ఉన్న రవిశేఖర్ పై తాజాగా కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. దర్యాప్తు మొదలుపెట్టిన హైదరాబాద్ పోలీసులు పలు బృందాలుగా రవిశేఖర్ కోసం గాలిస్తున్నారు. రవిశేఖర్ ఆచూకీ తెలిపినవారికి నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. రవిశేఖర్ ఎక్కడున్నాడో చెబితే లక్ష రూపాయలు ఇస్తామంటూ హయత్ నగర్ పోలీసులు ప్రకటన చేశారు.

నిందితుడు ఏపీ39 ఏక్యూ1686 నంబరు ఉన్న కారులో తిరుగుతున్నాడని, నకిలీ నంబర్ ప్లేట్ ఉపయోగించినట్టు తెలిసిందని పోలీసులు వెల్లడించారు. రవిశేఖర్ ఆచూకీ తెలిసినవారు 94906 17161, 94947 21100, 94906 17111 ఫోన్ నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలియజేయాలని పోలీసులు పేర్కొన్నారు. కాగా, రవిశేఖర్ నల్లమల అడవుల ప్రాంతంలో ఉన్నట్టు ఈ ఉదయం మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, వాటిపై మరింత స్పష్టత రావాల్సివుంది.
Go Back to Shorts
Police
Telangana
Andhra Pradesh
Hyderabad

More Telugu News