అలాంటి ఫొటోలు తీస్తే ఊరుకోవద్దు.. వెనక్కి తిరిగి చెంప పగలగొట్టండి: సల్మాన్ ఖాన్
- ఫొటోగ్రాఫర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సల్మాన్ ఖాన్
- వెనక నుంచి హీరోయిన్ల ఫొటోలు తీయడాన్ని తప్పుబట్టిన సల్మాన్
- అలాంటి పరిస్థితి వస్తే చెంప పగలగొట్టాలని నటీనటులకు సూచన
- సాయి మంజ్రేకర్, నేహా ధూపియా ఇబ్బంది పడ్డారని గుర్తు చేసిన వైనం
- ఆ ఫొటోలు తీసేది ఎవరో తెలిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఫొటోగ్రాఫర్ల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఫొటోగ్రాఫర్లు నటీనటుల, ముఖ్యంగా హీరోయిన్ల ఫొటోలను అసభ్యకర రీతిలో వెనక నుంచి తీయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ తరహా ప్రవర్తన చాలా అసహ్యకరమైందని, ఇలాంటివి ఎదురైనప్పుడు నటీనటులు మౌనంగా ఉండకుండా గట్టిగా బదులివ్వాలని పిలుపునిచ్చారు. 'బిగ్ బాస్ 20' వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయంపై సల్మాన్ మాట్లాడుతూ.. "కొందరు ఫొటోగ్రాఫర్లు హీరోయిన్ల ఫొటోలను వెనక వైపు నుంచి తీస్తున్నారు. అలా తీయడం ఏ హీరోయిన్‌కూ నచ్చదు. కొందరు పర్వాలేదనుకోవచ్చు. కానీ, ఇబ్బందిపడే వారి పరిస్థితి ఏంటి? ఇటీవల సాయి మంజ్రేకర్ ఇలాంటి ఘటనతో చాలా ఇబ్బంది పడింది. గతంలో నేహా ధూపియా కూడా దీనిపై పోరాడింది. చివరికి నా సొంత మేనకోడలు నడుస్తుండగా కూడా వెనక నుంచి ఫొటోలు తీశారు. ఆ తర్వాత ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి 'ఈమె ఎవరో గుర్తుపట్టండి?' అని క్యాప్షన్ పెడతారు. వాళ్లకు ఆ హక్కు ఎవరిచ్చారు?" అని ప్రశ్నించారు.
ఇలాంటి ఫొటోలు తీసే వారిని చూస్తే ఊరుకోవద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలని హీరోయిన్లకు సల్మాన్ సూచించారు. "ఇబ్బంది పడుతున్న అమ్మాయిలందరికీ నేను చెప్పేది ఒక్కటే. ఎక్కడైనా మీకు ఇలాంటి అనుభవం ఎదురైతే, వెంటనే వెనక్కి తిరిగి చెంప పగలగొట్టండి. మీ అమ్మ లేదా సోదరి ఫొటోలు ఇలా తీసి చూపించమని వారిని అడగండి. వీళ్లు చాలా అసహ్యకరమైన మనుషులు. ప్రతీ ఫంక్షన్‌లోనూ ఇదే తీరుగా ప్రవర్తిస్తున్నారు" అని హెచ్చరించారు.
ఇలాంటి మనస్తత్వం ఏంటని ప్రశ్నిస్తూ, ఆ ఫొటోగ్రాఫర్లను ఉద్దేశించి సల్మాన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. "నాకు తెలిసిన 90 శాతం మంది అమ్మాయిలకు, ఇప్పుడు తల్లులైన వారికి కూడా ఇలాంటివి నచ్చవు. ఈ రకమైన ఫొటోలు తీసే వాళ్లను నేను చూడాలనుకుంటున్నాను. ఒకవేళ వాళ్లు ఎవరో నాకు తెలిస్తే.. అప్పుడు ఉంటుంది" అంటూ తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు.