స్వాతంత్ర్య సంగ్రామం గత చరిత్ర కాదు.. మన వారసత్వ సంపద: చాగంటి కోటేశ్వరరావు
- త్యాగధనుల చరిత్రను తెలుసుకున్నప్పుడే దేశభక్తి పెరుగుతుందని వెల్లడి
- భారతీయం అనే పదం స్వాతంత్ర్య ఉద్యమ సమయంలోనే పుట్టిందని గుర్తుచేసిన చాగంటి
- దేశభక్తి ఉన్న లోకేశ్ విద్యామంత్రి కావడం విద్యార్థుల అదృష్టమని ప్రశంస
- స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రలను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలని పిలుపు
దేశ స్వాతంత్ర్య సంగ్రామం అనేది కేవలం గడిచిపోయిన చరిత్ర కాదని, అది తరతరాలకు అందించాల్సిన మనందరి వారసత్వ సంపద అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. ఎందరో మహనీయుల త్యాగాల పునాదులపై నిర్మితమైన స్వేచ్ఛ విలువను ప్రతి ఒక్కరూ గుర్తించి, దాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమంలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా చాగంటి మాట్లాడుతూ.. “ఒక తండ్రి తన జీవితాంతం కష్టపడి ఆస్తులు సంపాదించి పిల్లలకు ఇస్తాడు. ఆ సంపద వెనుక తన శ్రమ, త్యాగం ఉన్నాయని పిల్లలు గ్రహించాలని కోరుకుంటాడు. లేదంటే ఆ సంపదను నిలబెట్టుకోలేరని భయపడతాడు. మన స్వాతంత్ర్యం కూడా అలాంటిదే. ఎందరో మహనీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మనకు ఈ స్వేచ్ఛను అందించారు. కేవలం ఆ స్వేచ్ఛను అనుభవించడమే కాదు, దాని వెనుక ఉన్న త్యాగాల విలువను అర్థం చేసుకుని, దాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత” అని ఉద్బోధించారు.
‘భారతీయం’ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో పుట్టిన పదం
"భారతీయం అనే మాట ఇప్పుడు పుట్టింది కాదు. స్వాతంత్ర్య పోరాట సమయంలో, సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగినప్పుడు పుట్టింది. ‘భారతదేశం గురించి నిర్ణయాలు భారతీయులే తీసుకోవాలి’, ‘సైమన్ గో బ్యాక్’ అనే నినాదాలతో ప్రజలు ఉద్యమించారు.
భారతీయం లేని సైమన్ మాకు వద్దంటూ నినదించారు. అప్పుడే ఈ పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇలాంటి విషయాలను మనం నిరంతరం చర్చించుకుంటూ ఉండాలి. అప్పుడే పిల్లలకు మన చరిత్రపై అవగాహన, దేశంపై భక్తి కలుగుతాయి. లేదంటే నైతిక విలువలు నశించిపోతాయి" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
త్యాగాల స్ఫూర్తితో దేశభక్తిని నింపుకోవాలి
స్వాతంత్ర్య సమరయోధులు అనుభవించిన కష్టాలను వివరిస్తూ, “అండమాన్‌లోని కాలాపాని జైలు గురించి చదివితే వారి త్యాగాలు మనసును కదిలిస్తాయి. ఇరుకైన గదుల్లో వారు అనుభవించిన నరకం ఊహకు అందనిది. టంగుటూరి ప్రకాశం పంతులు గారు బ్రిటిష్ పోలీసుల తుపాకీకి గుండెను అడ్డుపెట్టి ‘ఆంధ్రకేసరి’ అయ్యారు. పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలి. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కేవలం గొప్ప గాయకుడే కాదు, స్వాతంత్ర్య ఉద్యమంలోనూ పాల్గొన్నారు.
పొట్టి శ్రీరాములు గారి అంతిమయాత్రలో దేశభక్తి గీతాలు పాడుతూ చివరి వరకు నడిచారు. ఇలాంటి మహనీయుల జీవిత చరిత్రలను పిల్లలకు చదివించాలి. మనకు దేవాలయాలు ఎంత పవిత్రమో, స్వాతంత్ర్య సమరయోధులు నడయాడిన ప్రదేశాలు, వారు బందీలుగా ఉన్న జైళ్లు కూడా అంతే పవిత్రమైనవి. వాటిని సందర్శించడం ద్వారా మన చరిత్రను తెలుసుకుని, దేశభక్తిని పెంపొందించుకోవచ్చు” అని చాగంటి సూచించారు.
లోకేశ్‌పై చాగంటి ప్రశంసలు
ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌పై చాగంటి కోటేశ్వరరావు ప్రశంసలు కురిపించారు. “పిల్లల్లో దేశభక్తి, నైతిక విలువలు పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ ‘భారతీయం’ కార్యక్రమం గురించి చెప్పడానికి మంత్రి లోకేష్ గారి ఇంటికి వెళ్లాను. ఆయన వెంటనే స్పందించి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి చెప్పిన సమయం కంటే ముందే వచ్చి హాజరయ్యారు.
ఆయనలో దేశం, చరిత్ర పట్ల ఉన్న ఆసక్తికి ఇది నిదర్శనం. తిరిగి వెళ్తున్నప్పుడు నా కారు వద్దకు వచ్చి, డ్రైవర్‌తో జాగ్రత్తగా తీసుకెళ్లమని చెప్పడం ఆయన సంస్కారాన్ని తెలియజేస్తుంది. ఇంతటి దేశభక్తి, పెద్దల పట్ల గౌరవం ఉన్న వ్యక్తి మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కావడం విద్యార్థుల అదృష్టం” అని అభినందించారు.
స్వాతంత్ర్యం మనకు ఊరికే రాలేదని, దాని వెనుక ఉన్న త్యాగాలకు మనమే వారసులమని పిల్లలకు అర్థమయ్యేలా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.